Reshma : కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో పాపులర్ కావాలని మంచి ఫేమ్ మరియు స్టార్ డం ఉన్నటువంటి నటి మండలం ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసి వారు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు. అయితే ఆ మధ్య తమిళంలో సంచలనం సృష్టించిన సూచీ లీక్స్ ప్రభావం ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీపై ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఫోటోలను తీసుకొని ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా సుచిలిక్స్ వ్యవహారంపై మరో తమిళం నటి రేష్మ పసుపులేటి కూడా స్పందించింది.
పోతివిరాళ్లకు వెళితే నటి రేష్మ పసుపులేటి తమిళంలో మరియు తెలుగులో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ మధ్య సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే ఆడపాదడపా పాత్రలతో బాగానే అలరిస్తోంది. తాజాగా నటి రేష్మ పసుపులేటి గతంలో తన గురించి వినిపించిన సూచీ లీక్స్ వ్యవహారం పై స్పందించింది.
ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులు ఓ రోజున తనకి ఫోన్ చేసి తన వ్యక్తిగత వీడియో ఒకటి ఇంటర్నెట్లో లీక్ అయిందని చెప్పారట. దీంతో తాను వెంటనే ఆ వీడియోని తనకి పంపించమని అడిగి ఆ వీడియోని చూసి అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేసిందట. అంతేకాకుండా ఆ వీడియోలో ఉన్న అమ్మాయి తనకంటే బాగుందని అలాగే తన శరీరానికి అలాగే ఆ వీడియోలో ఉన్నటువంటి అమ్మాయి శరీరానికి చాలా వ్యత్యాసం ఉందని కూడా తన తల్లిదండ్రులకి తెలిపిందట.
దీంతో తన తల్లి మరియు చెల్లి ఊపిరి పీల్చుకున్నారని అలాగే తన కుటుంబ సభ్యులు పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కావడంతో ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారని తెలిపింది. కానీ ఇలాంటి విషయాల్లో సినిమా బ్యాగ్రౌండ్ లేనటువంటి అమ్మాయిలు చిక్కుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కష్టమని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఆ వీడియో లీక్ అయినప్పుడు తాను వేరే దేశంలో ఉన్నానని తన సన్నిహితులు మరియు బంధువులకి కూడా నచ్చచెప్పడంతో మళ్లీ తాను నార్మల్ అయ్యానని కూడా తెలిపింది.