Sri Reddy : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ సంచలనానికి తెర లేపిన తెలుగు నటి శ్రీరెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎక్కువగా వివాదాలు గొడవలు మనస్పర్థలు వంటి వాటితోనే బాగా పాపులర్ అయింది.
దీంతో అనుకోకుండా టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురై తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసముంటోంది. అయినప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకుని సమాజంలో జరిగేటువంటి పలు సంఘటనలు మరియు రాజకీయ విషయాలపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి వీడియో మరియు ఆ వీడియో కి పెట్టినటువంటి క్యాప్షన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది.
అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే కొందరు పిల్లలు పార్కులో ఆడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తూ పార్కులోకి వచ్చి పిల్లలను కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ చిన్న పిల్లాడికి ఏకంగా మత్తు మందు ఇచ్చి పడిపోయేలా చేసి అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు.
కానీ ఇది గమనించిన ఓ మహిళ ఆ వ్యక్తిని అడ్డుకొని చిన్నపిల్లాడిని సేవ్ చేస్తుంది. దీంతో నటి శ్రీరెడ్డి ఈ వీడియోకి షేర్ చేస్తూ గుడ్డిగా ఎవరిని నమ్మకండి అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ నటి శ్రీరెడ్డి వీడియో పెట్టిన కాప్షన్ పెడర్థాలు తీస్తూ రాజకీయ రాజకీయపరంగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో నటి శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందంటూ మరి కొందరు అంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి ని వైకాపా అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదని అందువల్లనే నటి శ్రీరెడ్డి సైలెంట్ గా ఇలాంటి పరోక్ష ఉంటుం విమర్శలు చేస్తోందని మరికొందరు అంటున్నారు. కానీ నటి శ్రీరెడ్డి మాత్రం ఈ వ్యాఖ్యలను మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.