Telugu Actress తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 1992 వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన “ఆ ఒక్కటి అడక్కు” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ కామెడీ ఓరియెంటెడ్ చిత్రం ఇప్పటికీ టెలివిజన్ ఛానళ్లలో ప్రసారం అయినప్పటికీ మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేస్తోంది. అలాగే యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన కామెడీ సన్నివేశాలు వస్తే మాత్రం కడుపుబ్బా నవ్వు కోవాల్సిందే.
అయితే ఈ చిత్రంలో హీరో రాజేంద్ర ప్రసాద్ చెల్లెలి పాత్రలో నటించిన ప్రముఖ నటి శ్రీలత కూడా తన పాత్రకి వంద శాతం న్యాయం చేస్తూ బాగానే అలరించింది. అయితే గతంలో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించి బాగానే అలరించిన నటి శ్రీలత క్రమక్రమంగా సినిమాలకు దూరమైంది. అయితే తాజాగా నటి శ్రీలత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో ముఖ్యంగా తాను సినిమాల్లో నటించే సమయంలో కొంతమేర అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డానని ఆ సమయంలో ఓ తెలుగు ప్రముఖ హీరో తనకు చాలా సహాయం చేశాడని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో సపర్యలు చేసి చాలా అండగా నిలిచాడని దాంతో తనకి సోదరుడిలాంటి ఫీలింగ్ కలగడంతో అన్నయ్య అని పిలిచానని తెలిపింది. కానీ ఆ హీరోమాత్రం మరోలా అర్థం చేసుకొని తనని అన్నయ్య అని ఎందుకు పిలిచావంటూ దాదాపుగా గంట సేపు క్లాస్ పీకాడని చెప్పుకొచ్చింది. దీంతో ఆ హీరో ప్రవర్తించిన తీరు కారణంగా తనకి ఏడుపు వచ్చిందని అలాగే ఆ సంఘటనతో తాను మళ్లీ ఎవరినీ కూడా సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలవలేదని తెలిపింది. కానీ తాను అన్నయ్య అని పిలవడంతో క్లాస్ పీకిన హీరో పేరు మాత్రం బయటకు చెప్పడానికి ఇష్టపడలేదని తెలిపింది.
అయితే తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటనపై ఎలాంటి అవగాహన ఉండేది కాదని కేవలం దర్శక నిర్మాతలు చెప్పినట్లు నటించి వచ్చేదాన్ననని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న ప్రముఖ హీరో నాగ శౌర్య తనకి స్వయాన మేనల్లుడని అయినప్పటికీ ఎప్పుడూ కూడా అవకాశాల విషయంలోగానీ లేదా ఇతర అవసరాల విషయంలో నాగ శౌర్య ఇంటికి వెళ్లలేదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం తన భర్తతో కలిసి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాననని అలాగే ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారని తన తల్లి కూడా తనతోనే ఉన్నట్లు తెలిపింది.