Telugu Actress : ఆఫర్లు లేకపోవడంతో ఆ హీరోయిన్ రేట్ తగ్గించిందటగా….

Joythi R

Telugu Actress : సినిమా అనేది రంగుల ప్రపంచం. రంగుల ప్రపంచంలో రాణించాలంటే అందం అభినయం నటన ప్రతిభ వంటివి మాత్రమే కాకుండా అవకాశాలను ఎలా దక్కించుకోవాలి, వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అలాగే అవకాశాలు లేని సమయంలో ఎలా సృష్టించుకోవాలనే విషయాల గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోయిన్ పారితోషకం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఓ యంగ్ హీరో చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పంజాబీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో ఘాటుగా లిప్ కిస్ లు మరియు రొమాన్స్ అలాగే నెగిటివ్ షేడ్స్ వంటి ఎమోషన్స్ తో కుర్రకారు మతి పోగొట్టింది. దీంతో ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ మొదటి చిత్రంతోనే వచ్చేసింది. దీంతో దీంతో మొదటి సినిమాకి ఈ బ్యూటీ 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటే రెండో చిత్రం నుంచి ఏకంగా 50 నుంచి 75 లక్షలు రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంది.

అయితే ఈ హాట్ బ్యూటి అందాల ఆరబోతకు ఫిదా అయిన దర్శకనిర్మాతలు కూడా రెమ్యూనరషన్ విషయంలో అడ్డు చెప్పలేదు. దీంతో క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రంలోని కథ మరియు పాత్రల విషయంపై బొత్తిగా శ్రద్ధ వహించే లేకపోయింది. ఇంకేముంది వరుస డిజాస్టర్లు అలాగే తన కెరీర్లో చెప్పుకోవడానికి తన మొదటి చిత్రం తప్ప మరే చిత్రాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడి కొంతమేర చప్పగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రొమాంటిక్ సీన్స్ అలాగే లిప్ లాక్ సన్నివేశాలు కూడా సినిమాల్లో కామన్ అవ్వడం హీరోయిన్లు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. దీంతో ఈ అమ్మడికి కొంతమేర కాంపిటీషన్ పెరిగింది. దీంతో సీన్ రివర్స్ కావడంతో రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా ఈ బ్యూటీ సిద్ధపడినట్లు సమాచారం. అయినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పాపం ఈ బ్యూటీని అసలు పట్టించుకోవడం లేదని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో చేసేదేమీ లేక అవకాశాల కోసం ప్రస్తుతం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

- Advertisement -