Tridha : కొంతమంది నటీనటుల నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాకపోవడంతో గుర్తింపుకి నోచుకోలేక పోయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే 2015వ సంవత్సరంలో ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరియు నూతన దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కిన సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిధా చౌదరి కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ అమ్మడు సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నటించడానికికంటే ముందుగా బెంగాలీ భాషలో దాదాపుగా మూడు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కానీ నటి త్రిధా చౌదరి కి మాత్రం హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు. అయితే తెలుగులో నటి త్రిధా చౌదరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అడపాదడపా ఆఫర్లు వచ్చినప్పటికీ అవి కాస్త డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలో కొనసాగడం కోసం అలాగే ఆఫర్లు దక్కించుకుని కోసం బాగానే చెమటోడుస్తున్నది.
ఈ మధ్యకాలంలో నటి త్రిధా చౌదరి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ అభిమానులను బాగానే అలరిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు సెలవులను ఎంజాయ్ చేసేందుకు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ చిల్ అవుతోంది. ఈ క్రమంలో త్రిధా చౌదరి స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న టువంటి ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా నటి త్రిధా చౌదరికి హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయని కానీ సరైన అవకాశం రాకపోవడంతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని మరికొందరు అంటున్నారు.
అయితే ఆ మధ్య హిందీలో బాగా పాపులర్ అయినటువంటి ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ లో త్రిధా చౌదరి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది ఈ వెబ్ సిరీస్ బాగా మంచి హిట్ అయింది అంతేకాకుండా నటి త్రిధా చౌదరి కూడా కొంతమేర బోల్డ్ గా కనిపించడంతోపాటూ తన ప్రతిభను కూడా నిరూపించుకోవడం తో సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే అందాయి. అంతేకాకుండా పలువురు దర్శక నిర్మాతలు కూడా ప్రస్తుతం నటి త్రిధా చౌదరి కి సినిమా ఆఫర్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తున్న షంషేరా అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత వున్నటువంటి పాత్రలో నటించి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. మరి బాలీవుడ్ లోనైనా ఈ అమ్మడు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.