Telugu anchor lasya

Lasya: బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ లాస్య గురించి సినీ ఫ్యాక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ లాస్య షో ఏదైనా, ఈవెంట్ ఏదైనా సరే తనదైన శైలిలో యాంకరింగ్ నిర్వహించి ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. అందుకే లాస్య కి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

యాంకర్ లాస్య బెంగళూరుకు చెందినటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ యాంకర్ లాస్య మంజునాథ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులోనే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. కాగా ప్రస్తుతం లాస్య మంజునాథ్ రెండోసారి గర్భం దాల్చడంతో ఇంటి పట్టునే ఉంటూ ఎలాంటి షూటింగులకు, ఈవెంట్లకు వెళ్ళకుండా విశ్రాంతి తీసుకుంటుంది.

అయితే తాజాగా యాంకర్ లాస్య మంజునాథ్ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి లాస్య మంజునాథ్ తాజాగా ఈ విషయం గురించి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకి తెలియజేసింది. దీంతో లాస్య అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు హోలీ పండుగ కావడంతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటూ హోలీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

ఈ విషయం ఇలా ఉండగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో యాంకర్ లాస్య మంజునాథ్ రెండు మూడు చిత్రాలలో కూడా కనిపించింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో లాస్యకి నటిగా పెద్దగా గుర్తింపు లభించలేదు. దీంతో యాక్టింగ్ వదిలేసి యాంకరింగ్ వైపు వచ్చిన యాంకర్ లాస్య కి బుల్లితెర రంగంలో మంచి క్రేజ్ మరియు స్టార్డం లభించిందని చెప్పవచ్చు. అలాగే యాంకర్ లాస్య ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.