Sreemukhi: తెలుగు బుల్లితెరపై తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తూ, అల్లరి చేస్తూ బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ శ్రీముఖి ఈవెంట్ అయినా, గేమ్ షో అయినా, చురుగ్గా యాంకరింగ్ నిర్వహిస్తూ పంచులు హాస్యాన్ని పండిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మడుకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

యాంకర్ శ్రీముఖి తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్లో తెరకెక్కిన జులాయి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు సిల్వర్ స్క్రీన్ ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. అందుకే యాంకరింగ్ రంగంలోని అడుగుపెట్టి బాగానే సక్సెస్ అయింది. ప్రస్తుతం ఇటు కెరియర్ పరంగా అటు ఆర్థికంగా బాగా నిలదొక్కుకుంది. అయినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై మక్కువ చావలేదు. అందుకే మళ్ళీ ఈ అమ్మడు స్క్రీన్ పై అవకాశాలు దక్కించుకొని రాణించాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో గ్లామర్ షో ని నమ్ముకుని అందాల ఆరబోతకి తెర లేపింది. దీంతో వరుసగా ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ. అయితే తాజాగా యాంకర్ శ్రీముఖి ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతతో ఫోటోలకి ఘాటుగా ఫోజులిచ్చింది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ అందాలకి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ఇదే రేంజ్ లో అందాలు ఆరబోస్తే సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా ఆఫర్లు ఖాయమని అంటున్నారు కొందరు. మరికొందరు మాత్రం ఇంత బోల్డుగా అందాలు ఆరబోయడం వలన సినిమా ఆఫర్లు వస్తాయో రావో తెలియదు కానీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం బాగా డిస్టర్బ్ అవుతారని కాబట్టి బుల్లితెరపై కెరియర్ బాగుండాలంటే అందాల ఆరబోతకి పుల్ స్టాప్ పెడితే బాగుంటుందని అంటున్నారు. కానీ యాంకర్ శ్రీముఖి మాత్రం నెటిజన్ల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం హీరోయిన్ ఆఫర్లనే టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. మరి ఈ తెలుగమ్మాయి అందాల ఆరబోతకి ఇప్పటికైనా దర్శకనిర్మాతలు కనికరించి ఆఫర్లు ఇస్తారో లేదో చూడాలి.