Bigg Boss : తెలుగులో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజా రామచంద్రన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు అందరిలాగే హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చింది. కానీ దురుద్రుష్ట వశాత్తు హీరోయిన్ గా ఆఫర్లు వరించలేదు. దీంతో చేసేదేమీ లేక ఈ అమ్మడు హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, అక్క చెల్లి తదితర పాత్రల్లో నటించింది. అలాగే తెలుగులో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే కట్టుకుంది. బికినీలు ధరించి అందాలు ఆరబోయ్యడంతో పాటూ, బోల్డ్ మరియు వ్యాంప్ తరహ పాత్రల్లో కుడా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. కాగా నటి పూజా రామచంద్రన్ సినీ లైఫ్ లో మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కుడా పలు ఒడిదుడుకులు ఎదుర్కుంది.
ఈ క్రమంలో మొదటగా నటి పూజా రామచంద్రన్ ఓ ప్రముఖ మ్యూజిక్ సంస్థలో పని చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. అలాగే పెళ్ళయిన కొద్ది రోజులకే మనస్పర్ధలు, విబేధాలు వంటివి తలెతడంతో తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చి సెపరేట్ అయ్యింది. అయితే విడాకులు అనంతరం నటి పూజా రామచంద్రన్ కొంతకాలం పాటూ ఒంటరిగానే లైఫ్ లీడ్ చేసింది. అలాగే సినిమాలకి మాత్రం ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా తన అభిమానులను బాగానే అలరించింది. కాగా ఆ మధ్య నటి పూజా రామచంద్రన్ కన్నడ సినీ పరిశ్రమకి చెందిన జాన్ కొక్కెన్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
కాగా నటుడు జాన్ కొక్కెన్ కుడా తెలుగులో పలు చిత్రాలలో విలన్ గా నటించి బాగానే అలరించాడు. అలాగే వీరిద్దరూ కల్సి నటిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే మంచి చెడులను చర్చించుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం చాల హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాగా తాజాగా నటి పూజా రామచంద్రన్ తల్లి కాబోతున్నట్లు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించింది. అలాగే ఈ విషయాన్ని తన అభిమానులకు తెలియజేస్తూ వీరిద్దరూ నటి పూజా రామచంద్రన్ తన భర్త తో కలసి దిగిన ఫోటోలను కుడా షేర్ చేసింది. అలాగే తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. దీంతో నెటిజన్లు నటి పూజా రామచంద్రన్ మరియు జాన్ కొక్కెన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.