Regina : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అలాగే సినిమా ఇండస్ట్రీ పై అవగాహన బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా వార్త బయటకు పొక్కినా లేదా సెలబ్రిటీలు కలిసి బయటికి వచ్చినా సరే వారిమధ్య ఏదో ఉందంటూ అలాగే నిజా నిజాలు తెలుసుకోకుండా వారి మధ్య ఉన్నటువంటి బంధాన్ని వక్రీకరిస్తూ కొంతమంది చేసేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ఈ కారణంగా సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా గురించి టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమంలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటి రేజీనా తెలుగులో హీరోగా రాణిస్తున్నటువంటి ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని తొందరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రెజీనా ప్రేమలో పడినటువంటి ఆ యంగ్ హీరో అప్పటీకే ఇండస్ట్రీ లో వెల్ సెటిల్డ్ స్టార్ హీరో కుటుంబం నుంచి రావడంతో తమ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. కాగా గతంలో నటి రెజీనా ఆ యంగ్ హీరోతో కలిసి రెండు, మూడు చిత్రాలలో నటించింది.
దీంతో వీరిద్దరూ కలిసి నటిస్తున్న సమయంలో ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. దాంతో రెండు మూడు సార్లు నటి రెజీనా కూడా తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో జరిగినటువంటి వేడుకలకు కూడా హాజరైందని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈమధ్య రెజీనాకి ఆఫర్లు బాగానే క్యూ కడుతున్నాయి. దాంతో రెజీనా పై కొంతమేర ఫోకస్ పెరగడంతో ఇలాంటి గాసిప్స్ టాలీవుడ్ సినీ టౌన్ లో తెగ వినిపిస్తున్నాయి. కానీ రెజీనా మాత్రం ఇలాంటి గాసిప్స్ పై స్పందించడం లేదు సరి కదా కనీసం పట్టించుకోవడం కూడా లేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రెజీనా తెలుగులో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. అలాగే అనన్య’s టుటోరియల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రముఖ ఓటిటి అయిన ఆహా లో ప్రసారమవుతోంది ఈ వెబ్ సిరీస్. కాగా ప్రస్తుతం ఈ అమ్మడుకి తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో దాదాపుగా 5కి పైగా చిత్రాలు ఆఫర్లు ఉన్నాయి. అలాగే ప్రముఖ ఓటీటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు జీ ఫైవ్ లు నిర్మిస్తున్న మరో రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.