Telugu Short Film Heroines డ్రగ్స్ వ్యవహారం లో చిక్కిన షార్ట్ ఫిలిమ్స్ హీరోయిన్లు…

Joythi R

Telugu Short Film Heroines ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇందులో పోలీసులు అకస్మాత్తుగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ మింక్ పబ్ లో రైడ్ జరపగా సినీ పరిశ్రమకు చెందిన బడా సెలబ్రిటీల పిల్లలు మరియు రాజకీయ నాయకుల పిల్లలు కూడా మాదకద్రవ్యాలను వినియోగిస్తూ పోలీసులకు దొరికారు. అయితే ఇందులో దాదాపుగా 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు ప్రముఖ నటుడు మరియు నిర్మాత కొణిదల నాగబాబు తనయ నిహారిక కొణిదెల కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోగా ఇందులో నిహారిక కొణిదెల తప్పు లేదని పోలీసులు నిర్ధారించారు.

అయితే ఈ పబ్ లో మాదకద్రవ్యాలు వినియోగిస్తూ పట్టుబడిన వారిలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్లుగా నటించిన ఖుషిత కల్లపు మరియు లిష గణేష్ తదితరులు కూడా ఉన్నట్లు పోలీసులకు కనుగొన్నారు. దీంతో వీరిని కస్టడీలోకి తీసుకొని వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కెరియర్లో నిలదొక్కుకుంటున్న ఇద్దరు హీరోయిన్లు డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడంతో వీరిద్దరి సినీ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులకు చిక్కిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించాడు. ఇందులో భాగంగా తాను పబ్ లో డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా తాను గతంలో ప్రభుత్వ సంస్థలతో కలిసి మాదకద్రవ్యాలను నిషేధం కోసం ప్రమోద్ చేశానని అలాంటిది తాను ఎలా డ్రగ్స్ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనప్పటికీ మాదకద్రవ్యాల వినియోగం మరియు మద్యం సేవించడం వంటివి ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వ సంస్థలు ప్రమోట్ చేస్తున్నప్పటికీ కొందరు డబ్బు కోసం చేసేటటువంటి పనుల కారణంగా అనవసరంగా మరికొందరు బలవుతున్నారు. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో చిక్కిన ఈ 150 మంది భవిష్యత్తు ఏమిటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -