Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్, కీరవాణి తర్వాత తమన్ పేరు ఎక్కువగా వినిపించేది. కానీ ప్రస్తుతం వారిద్దరిని వెనక్కి నెట్టి స్టార్ హీరోల సినిమాల అవకాశాలు అందుకొని తమన్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా కైనా తమన్ అందించే సంగీతం ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా హిట్ కి తమన్ అందించిన సంగీతం కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ బ్రో ‘ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజగా ఈ సినిమా నుండి విడుదలైన పాటకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న తమ ఈ పాటపై ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ గురించి స్పందించాడు.ఈ క్రమంలో తమన్ మాట్లాడుతూ.. ఆ కథకి, ఆ సందర్భానికి ఎలాంటి పాట పెడితే బాగుంటుందో అలాంటి పాట పెట్టామని తమన్ తెలిపారు.
Thaman: నాకు క్రికెట్ అంటే వ్యసనం…
అలాగే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న కామెంట్స్ పై కూడా తమన్ రియాక్ట్ అయ్యారు. తమన్ అందించే సంగీతం ఇతర సినిమాల నుండి కాపీ కొడతాడని,అలాగే తమన్ కి క్రికెట్ మీద ఉన్న శ్రద్ద మ్యూజిక్ పైన లేదు అంటూ ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల తమన్ వాటిపై స్పందిస్తూ..నాకు ఇతర ఏ అలవాట్లు లేవు. నాకున్న ఒకే ఒక్క వినోదం క్రికెట్. రాత్రి 9 గంటలకు వెళ్లి క్రికెట్ ఆడుతా…అంతే కానీ పని వదిలిపెట్టి క్రికెట్ ఆడానని ఏ ఒక్క డైరెక్టర్, నిర్మాత కూడా నాపై ఫిర్యాదు చేయలేదు. కాబట్టి నేను ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.