Thaman : మహేష్ బాబు సీక్రెట్స్ చెప్పిన తమన్.. అవి వింటే అభిమానులకు పునకాలే!

Akashavani

Thaman : తెలుగు ప్రజలకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో మారుమోగుతున్న పేరులలో తమన్ కూడా ఒకరు. రవితేజ నటించిన కిక్ సినిమా ద్వారా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అయ్యాడు. ఆ తర్వాత బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఆ పై పలు సినిమాలకు తమన్ తన అద్భుతమైన సంగీతం అందించి తెలుగునాట మ్యూజిక్ డైరెక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆ మధ్య వచ్చిన అఖండ సినిమాతో థమన్ బీ టౌన్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే.. విడుదలైన ఈ సినిమాలో కళావతి పాటకు ప్రేక్షకుల్లో భారీ స్థాయి ఆదరణ పెరిగింది. ఈ పాట విన్న సంగీత ప్రియులు తమన్ ను మరో లెవెల్ లో మెచ్చుకుంటున్నారు. కాగా ఈ సినిమాను ఈ నెల 12 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ముందుగా స్టార్ట్ చేశారు.

శనివారం రోజు అనగా మే 7న హైదరాబాద్ యూసఫ్ గూడా లోని ఒక పోలీసు స్టేషన్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ తో తకిట తకిట విత్ తమన్ అంటూ చిట్ చాట్ స్టార్ట్ చేసారు. ఈ క్రమంలో యాంకర్ సుమ ఈ చిత్ర బృందం క్రికెట్ ప్లేయర్స్ అయితే ఎవరికి ఏ పోసిషన్ ఇస్తావని తమన్ ను అడుగుతుంది.

Thaman : మహేష్ బాబు సీక్రెట్స్ చెప్పిన తమన్.. అవి వింటే అభిమానులకు పునకాలే!
Thaman : మహేష్ బాబు సీక్రెట్స్ చెప్పిన తమన్.. అవి వింటే అభిమానులకు పునకాలే!

Thaman: మహేష్ బాబు గురించి తమన్ ఈ విషయాన్ని బయట పెట్టాడు!

దాంతో మంచి ఫీల్డర్ అని తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెపుతాడు. ఎటు నుంచి బాలు వచ్చినా పట్టుకునేది ఒక కెప్టెన్.. అది మహేష్ బాబు అని తమన్ వెల్లడించాడు.

- Advertisement -