Thamannah: తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం తిరిగి వరస సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈమె జైలర్ ,భోళా శంకర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో జైలర్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తమన్న తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు..తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తో కలిసి రెబల్ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా కాకుండా తనకు ప్రభాస్ తో కలిసిన నటించే అవకాశం మరోసారి వచ్చిందని కానీ తనకు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆ సినిమాను వదులుకున్నానని తెలియజేశారు. ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ముందుగా నటించే అవకాశం తమన్నాకే వచ్చిందట.
Thamannah మిస్టర్ పర్ఫెక్ట్ అవకాశం నాకే వచ్చింది…
ఇలా ఈ అవకాశం రావడంతో ఈమెకు డేట్స్ ఖాళీగా లేకపోయినా సందర్భంలో ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నారని తెలియజేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత తాను ఈ సినిమాలో చేసి ఉంటే బాగుండేదని, ఈ సినిమాని మిస్ చేసుకుని బాధపడుతున్నాను అంటూ ఈ సందర్భంగా తమన్నా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో కాజల్ తాప్సీ ఇద్దరు నటించారు. మరి ఈమెకు ఎవరి పాత్రలో నటించే అవకాశం వచ్చిందనేది మాత్రం తెలియజేయలేదు.