Tharun: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో తరుణ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన నటనతో కొన్ని సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు.1990 అంజలి సినిమాతో మొదటిసారిగా అడుగుపెట్టిన తరుణ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించాడు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
గతంలో కొన్ని సినిమాలలో ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా కొన్ని వివాదాలతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మళ్లీ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వగా సినిమా అంతా సక్సెస్ ను అందివ్వలేదు. ఇదిలా ఉంటే ఒకప్పటి తెలుగు సినీ నటులు రోజారమణి, చక్రపాణి దంపతుల కుమారుడే తరుణ్.

Tharun: ఏ సర్టిఫికెట్ సినిమా థియేటర్లో వేసిన తరుణ్ సినిమా ఇదే..
ఇక తరుణ్ నటించిన సినిమా ఏ సర్టిఫికెట్ సినిమాలు వేసే థియేటర్ లో వేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. నువ్వే కావాలి. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. కేవలం సినిమా కథనే కాకుండా పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాలో తరుణ్ సరసన రిచా హీరోయిన్ గా నటించింది. ఆమెకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది. ఇక ఈ సినిమాతోనే తరుణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా ప్రతి థియేటర్లో బాగా సందడి చేసింది. అంతేకాకుండా ఏ సర్టిఫికెట్ సినిమాలు వేసే థియేటర్ లో కూడా ఈ సినిమా ఆడగా అక్కడ కూడా దాదాపు వందరోజుల వరకు ఆడింది. అలా ఏ సర్టిఫికెట్ సినిమా థియేటర్లో కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో ఆడి భారీ వసూలు సొంతం చేసుకుంది.