Nagarjuna supported : రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అవికా గౌర్. ఈ సినిమాతో తన నేచురల్ నటలతో అందరినీ ఆకట్టుకుంది. సామాన్య యువతి పాత్రలో అందరిలో కనిపించింది. ఆ సినిమాతో ఆమె నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో అవికా గౌర్ నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయింది.
అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యాననర్, ఆచార్య క్రియేషన్ బ్యానర్లు సంయుక్తంగా అవికా గోర్, ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో పాప్ కార్న్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో అవికా గౌర్ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. ఈ సినిమాకు భోగేంద్ర గుప్తాతో కూడా నిర్మాతగా ఉన్నాడు. అవికా గౌర్ ఈ సినిమాకు నిర్మాతగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రలో నటించింది.
మురళి గంధం ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించగా.. సాయి రోనక్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే తాజగా పాప్ కార్న్ సినిమా ట్రైలర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్బంగా అవికా గోర్ మాట్లాడుతూ.. తన తొలి సినిమా ఉయ్యాలా జంపాలా సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ తోనే ప్రారంభమైందని, అప్పడు నాగార్జునతో పరిచయం అయిందని తెలిపాడు.
Nagarjuna supported :
నాగార్జున ఎప్పుడూ మా వెంట ఉన్నాడని, నాగార్జున మంచి మనిషి అని అవికా గోర్ ప్రశంసలు కురిపించింది. పాప్ కార్న్ సినిమాకు నిర్మాతగా చేయడం చాలా రిస్క్ అని అన్నారని, అయితే తాను రిస్క్ తీసుకున్నాని అవికా గౌర్ తెలిపింది. నిర్మాతగా తనకు తన తల్లిదండ్రులు బాగా సపోరు్్ చేశారని, నిర్మాతగా కూడా మారినందుకు తాను గర్వంగా ఫీల్ అవ్వుతున్నట్లు అవికా గౌర్ స్పష్టం చేసింది.