The legend saravana: జీడి జెర్రీ దర్శకత్వంలో ఇటీవలే తెరకెక్కిన సినిమా ‘ది లెజెండ్’. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు అనుకున్నంత రీచ్ కాలేదు. ఇక ఈ సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు ప్రముఖ వ్యాపారవేత శరవణన్. ఇక ఎటువంటి టాలెంట్ లేకున్నా కూడా హీరోగా అడుగుపెట్టాడు శరవణన్. ఈయన చూడటానికి చాలా పెద్ద వయసు వ్యక్తిలా ఉంటాడు. ఇక ఈయన తమిళనాడు కేంద్రంగా ప్రముఖ వస్త్ర దుకాణాల చేయిన్ నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా బంగారు ఆభరణాల విక్రేత. వస్త్ర దుకాణాల చేయిన్ కు అధినేతనే కాకుండా ఇంకా ఈయన చేపడుతున్న బాధ్యతలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈయన ఈ సినిమాలో హీరోగా నటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి నటనకు వయసు అడ్డం కాదు అన్నట్లుగా.. లేటు వయసులో కూడా హీరో అయ్యాడు ఈ లెజెండ్ శరవణన్.
ఇక ఈ లెజెండ్ శరవణన్ అసలు పేరు అరుళ్ శరవణన్. ఈయన 1970లో పుట్టాడు. ఈయన వయసు దాదాపు 52 సంవత్సరాలు. ఇక వీరి ఫ్యామిలీ పెద్ద రిటైల్ స్టోర్ చైన్ ను నడుపుతుంది. తమిళనాడులో వీరి ఫ్యామిలీ గురించి తెలియని వారు లేరు. ఇతని తండ్రి పేరు సెల్వారత్నం.
సెల్వా రత్నం నెల్లై జిల్లా నుంచి చెన్నైకి వచ్చి టి అమ్మి ఆ తర్వాత పెద్ద బిజినెస్ మాన్ గా మారాడు. ఈయనకు ఇద్దరు తమ్ములు కూడా ఉండగా తన వ్యాపారంలో వారిని భాగస్వాములుగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత అరుళ్ తన బాబాయ్ ల నుంచి వచ్చేసి ది లెజెండ్ శరవణన్ అనే పేరుతో కొత్త స్టోర్స్ మొదలుపెట్టాడు.
ఇక తన బిజినెస్ బాగా నడిచింది. ఇక అరుళ్ తన బ్రాండ్ కి తానే అంబాసిడర్ గా ఉంటూ.. కోట్లలో పారితోషకాలు ఇచ్చి స్టార్ హీరోయిన్లను తన బిజినెస్ యాడ్స్ లలో నటింపజేసేవాడు. ఇక ఈయనకు హీరో కావాలని కోరిక ఉండటంతో ది లెజెండ్ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు.
The legend saravana: ఎవరి గురించి పట్టించుకోకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ది లెజెండ్..
ఈ సినిమాకు తాను 70 కోట్లకు పైగానే ఖర్చు చేశాడు. కానీ ఈ సినిమా మాత్రం హిట్ కాలేదు. అయినా కూడా అతడు అవన్నీ పట్టించుకోలేనట్లు తెలుస్తుంది. కేవలం ఇండస్ట్రీలో కూడా హీరో గుర్తింపు కోసం ఆయన సినిమాలలో నటించినట్లు అర్థమవుతుంది. నిజానికి ఆయనకు యాక్టింగ్ రాకపోయినా కూడా ఎవరు చూసిన చూడకపోయినా సినిమా తీస్తా అన్నట్లుగా ముందుకు వచ్చాడు.