ఈ మధ్యనే జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన చిన్న సినిమా బలగం పెద్ద సునామీనే సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ భాష, సంప్రదాయాలు, మనుషుల మధ్య బంధాలని వేణు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటిటిలో కూడా సునామీ కలెక్షన్లు సృష్టిస్తుంది.
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలయిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుంది. ఇప్పటివరకు వెండి తెర మీద కమెడియన్ గా మన అందరికీ పరిచయమైన వేణుకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఈ సినిమా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రదర్శిస్తున్నారు అంటే సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా మీద ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలని సోషల్ మీడియా పంచుకున్నారు. వేణుకి ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలని వెల్లడిస్తూ సూచనలు సలహాలు ఇచ్చే పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా తనని కంటనీరు పెట్టించిందని చెప్పుకొచ్చారు.
సినీ దర్శకుడు వేణుకి, పాటల రచయిత కాకర్ల శ్యామ్ కి ఫోన్ చేసి అభినందించారట. ఒక సినిమాకి ఏది బలము అది బలగం సినిమాలో ఉంది. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకుంటుందని నిర్మాత కూడా ఊహించి ఉండరు. పెట్టిన ఖర్చు కంటే పది రెట్లు ఎక్కువ వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. కథలో బలం ఉంటే అగ్ర హీరోలు, దర్శకులు, రచయితలు అవసరం లేదు.
Paruchuri
అలాగే బడ్జెట్ అనేది కూడా పెద్ద విషయం కాదు అంటూ తన అభిప్రాయాలని చెప్పకు వచ్చారు గోపాలకృష్ణ. వేణుని జబర్దస్త్ కమెడియన్ గా చూశాను ఇతడిలో గొప్ప రచయిత ఉన్నాడని ఊహించలేదు. ఈ సినిమా చూసి ఒక సినిమా వ్యక్తిగా నేనే కన్నీరు పెట్టుకున్నాను ఇది ఒక అపురూప దృశ్య కావ్యం. సినిమా చూసిన వారు ఎవరైనా కన్నీరు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి అంటూ చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ.