Actor : సమాజంలో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. గతంలో ఆడవారికి రక్షణ లేదు అనే పరిస్థితులు ఉండగా.. ఇప్పుడు మగవారికి రక్షణ లేదు అనే స్థితి వచ్చింది. ఈ మధ్యన మగవారి మీద ఆడవారు కూడా దాడులకు పాల్పడుతుండగా.. వారికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ నటుడి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ నటుడు, డ్యాన్సర్ రమేష్ జనవరి 27వ తేదీన తన పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రమేష్ పదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రమేష్ మొదటి భార్య రెండో భార్య వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. రెండో భార్య తన భర్త రమేష్ ను విపరీతంగా వేధింపులకు గురి చేసిందని ఆమె ఆరోపించింది.
తన ఆరోపణలు నిజమే అనేలా ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో రెండో భార్య దారుణంగా హింసించినట్లు కనిపిస్తోంది. చేతిలో ఓ పొడవాటి కర్రతో అతడిని చితకబాదినట్లు కనిపిస్తోంది. తనను కొట్టవద్దని రమేష్ టేబుల్ ఫ్యాన్ ను అడ్డుగా పెట్టుకొని ప్రాధేయపడుతండగా, రెండో భార్య, కూతురు చచ్చిపోమని శాపనార్థాలు పెట్టడం వినిపించింది.
Actor :
దెబ్బలను తట్టుకోలేక రమేష్.. ‘నా వల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నా’ అని విలవిలలాడటం కనిపించింది. దీనికి ‘ఉరితాడు తీసుకురమ్మంటావా?’ అని కూతురు అనడం అందులో కనిపించింది. వీడియో చివర్లో సోఫా మీద రెండో భార్య కట్టెతో కూర్చొని ఉండటం స్పష్టంగా కనిపించింది. కాగా టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్, తర్వాత రియాల్టీ షోలో అవకాశం, తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందాడు. కాగా అజిత్ తునివులో, రజినీకాంత్ జైలర్ లో కూడా నటించాడు.