Tollywood Actress: బాలయ్య హీరోయిన్ కు యాక్సిడెంట్.. అయినా కూడా దేవుడిని దర్శించుకున్న బ్యూటీ!

Akashavani

Tollywood Actress: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ హీరో బాలకృష్ణ నటించిన వీరభద్ర సినిమాలో హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. వీరభద్ర సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమాలో తన అందంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక తన పుట్టిల్లు లాంటి బాలీవుడ్ లో ఆషిక్ బనాయా ఆప్నే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి బాలీవుడ్ లో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆపై తనుశ్రీ బాలీవుడ్ స్క్రీన్ కి చాలా కాలం దూరంగా ఉంది.

ఇక తను శ్రీ దత్త సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తనుశ్రీ దత్త కి యాక్సిడెంట్ అయింది అన్న వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఆమెకు యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ యాక్సిడెంట్ వల్ల తన నమ్మకం మరింత బలపడింది అని తనుశ్రీ చెప్పుకు వస్తుంది. ఇక రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ తనుశ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ క్రమంలో తనుశ్రీ తన మోకాలికి రక్తంతో ఉన్నట్లు కనిపిస్తుంది.

Tollywood Actress: బాలయ్య హీరోయిన్ కు యాక్సిడెంట్.. అయినా కూడా దేవుడిని దర్శించుకున్న బ్యూటీ!
Tollywood Actress: బాలయ్య హీరోయిన్ కు యాక్సిడెంట్.. అయినా కూడా దేవుడిని దర్శించుకున్న బ్యూటీ!

Tollywood Actress: తనుశ్రీ దత్తా అభిమానులు ఈ విధంగా తనకు సానుభూతి తెలుపుతున్నారు!

ఇక ఈ విషయం తెలుసుకున్న తను శ్రీ అభిమానులు ఆమెకు కామెంట్ల రూపంలో సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఇక తనుశ్రీ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరెందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ వీడియోలు పై ఒక లుక్కెయండి.

- Advertisement -