Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాస్త సమంత పోలికలతో ఉండటమే ఈమె అదృష్టం.సమంత పోలికలతో ఉండటం వల్ల ఈమె చేసిన టిక్ టాక్ వీడియోలు ఈమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చాయి.ఇలా సోషల్ మీడియాలో ఎంతో మంచి పాపులర్ కి సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు బుల్లితెరపై పలు అవకాశాలు కూడా వచ్చాయి.ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు సింగర్ రాహుల్ తో కలిసి ఈమె నడిపిన లవ్ ట్రాక్ మామూలుగా లేదు. నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనేలా వ్యవహరించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. అదేవిధంగా ఈమె సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన ఇంటర్వ్యూ పెద్ద ఎత్తున వైరల్ అయింది.ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్నారు.ఈ విధంగా అందాలను ఆరబోస్తూ ఈమె ఫోటోషూట్ చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Ashu Reddy: ఆశు పోస్ట్ పై స్పందించిన జెస్సీ…
ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేశారు. అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన అశు రెడ్డి తనని నమ్మిన వాళ్లకు తనలో దాగివున్న చెడు కోణాన్ని చూపించే వ్యక్తిని తాను అంటూ చెప్పుకొచ్చారు. ఆశు రెడ్డి ఇలా ఈ పోస్ట్ ను షేర్ చేయడంతో వెంటనే బిగ్ బాస్ జెస్సీ స్పందిస్తూ పిక్ క్రెడిట్ ఇవ్వలేదని గోల పెట్టారు. అలాగే హెయిర్ స్టైల్ క్రెడిట్ కూడా ఇవ్వలేదంటూ కెమెరామెన్ కామెంట్ చేశారు. మొత్తానికి అశు రెడ్డి ఏదో ఒక విషయం ద్వారా నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.