Tollywood Actress: సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటారు అని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు వీరు పరిస్థితులు ఎలా ఉంటాయో వీరికే తెలీదు. అలా చాలామంది నటీనటులు కెరీర్ మొదట్లో మంచి పలుకుబడితో ఉన్నా కూడా తమ జీవితం చివర్లో మాత్రం దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో ఒకరు ఒకప్పటి తెలుగు హాస్య నటి కల్పనా రాయ్.
ఈమె తెలుగు సినిమాలలో హాస్య నటిగా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఏంటబ్బాయ్ అనే ఒక డైలాగ్ తో అందర్నీ బాగా నవ్వించింది. ఈమె తొలిసారిగా ఓ సీత కథ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత శ్రీమతి కావాలి, కారు దిద్దిన కాపురం, ఆఖరి పోరాటం, ప్రేమించుకుందాం రా, శీను, ప్రియమైన నీకు, పుట్టింటికి రా చెల్లి ఇలా 430 సినిమాల్లో నటించింది.
ఇక ఈమె చివరిగా 2007లో విడుదలైన మధుమాసం సినిమాతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఇక ఆ తర్వాత ఈమె 2008లో మరణించింది. అన్ని సినిమాల్లో నటించిన కూడా చివరికి ఏమిలేని విధంగా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంది. ఎందుకంటే ఎవరి రోజులు ఆమె దగ్గర తను సంపాదించుకున్న డబ్బు కూడా లేకపోయింది. కారణం డబ్బున్నంత కాలం ఆమె ఇతరులకు బాగా సహాయం చేసేది.

Tollywood Actress: చివరి క్షణంలో తను ఎదుర్కొన్న పరిస్థితి ఇదే..
కనీసం తాను డబ్బులు దాచి పెట్టుకోకుండా ప్రతిఒక్కరికి తన తోచిన సహాయం చేసేది. అలా చివరి రోజుల్లో కూడా ఏమి దాచుకోలేదు. తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె అంత్యక్రియల కోసం పదివేల రూపాయలు మాత్రమే అందించారు. ఆమె మరణించిన రోజు సినీ ఇండస్ట్రీ నుండి ఎవరు కూడా హాజరు కాలేదు.