Tollywood Actress: పక్కాగా ప్రేమ పెళ్లి చేసుకుంటా.. ఇది ఫీక్స్.. నటి కామెంట్స్ వైరల్!

Akashavani

Tollywood Actress: టాలీవుడ్ ప్రేక్షకులకు రుక్సార్ థిల్లాన్ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ హీరో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. ఆ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.

ఇక ఆ తర్వాత ఏబిసిడి సినిమాలో నటించి తన అందంతో తెలుగు ప్రేక్షకుల్లో మరువలేని ముద్ర వేసుకుంది ఈ అమ్మడు. మొత్తానికి ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే రుక్సార్ అశోకవనంలో అర్జున్ కళ్యాణం చిత్రం లో హీరో విశ్వక్ సేన్ తో జతకట్టిన సంగతి మనకు తెలుసు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈరోజు అనగా ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ ఈవెంట్ లో రుక్సార్ పాల్గొంది.

ఆ సినిమాలో తన పాత్ర గురించి, విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని తెలిపింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వచ్చి తెలుగు డైరెక్టర్ లలో సుకుమార్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. యాక్టింగ్ లో మహేష్ బాబు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకు వచ్చింది. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ తో ఒక సినిమా చేసినా చాలు అన్నట్లు తెలిసింది.

Tollywood Actress: పక్కాగా ప్రేమ పెళ్లి చేసుకుంటా.. ఇది ఫీక్స్.. నటి కామెంట్స్ వైరల్!
Tollywood Actress: పక్కాగా ప్రేమ పెళ్లి చేసుకుంటా.. ఇది ఫీక్స్.. నటి కామెంట్స్ వైరల్!

Tollywood Actress:  రుక్సార్ ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని తెలిపింది!

అంతేకాకుండా.. మా ఇంట్లో దాదాపు మొత్తం లవ్ మ్యారేజ్ లే జరిగాయని తెలిపింది. సో నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పుకు వచ్చింది. నన్ను బాగా అర్థం చేసుకొని, నా కెరీర్ కి సపోర్ట్ చేసే వాడిని నా అభిప్రాయాలను గౌరవించే వ్యక్తి ని పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.

- Advertisement -