Tollywood Actress : స్టార్ హీరో మైకంలో పడి కెరియర్ నాశనం చేసుకుంటున్న తెలుగు స్టార్ హీరోయిన్….

Joythi R

Tollywood Actress (స్టార్ హీరోయిన్) మామూలుగా ఎవరైనా సరే ఎలాగైనా ఒక్క అవకాశాన్ని దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఎన్నో అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొని మరి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికి అదృష్టం బాగుండి సినిమా అవకాశాలు తొందరగానే లభిస్తే మరికొందరికి మాత్రం సగం జీవితం అయిపోయినా సరే అవకాశాలతో పాటు గుర్తింపు కూడా లభించదు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు ఒకటి, రెండు హిట్లు పడగానే ఏకంగా తమ అవకాశాల గురించి ఆలోచించకుండా ఇతర పనులపై దృష్టి పెడుతూ లేనిపోని చిక్కులలో పడుతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఓ స్టార్ హీరో మోజులో పడి తన సినీ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

కాగా రెండేళ్ల క్రితం ముంబైకి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరో నటించిన చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అవడంతోపాటు ఈ హీరోయిన్ నటనకి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. దీంతో వెంటనే ఈ బ్యూటీకి ఓ స్టార్ హీరోతో పరిచయం ఏర్పడింది. అలాగే అనుకోకుండా ఈ స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్ కలిసి ఒకే సినిమాలో నటించే అవకాశం కూడా రావడంతో బ్యూటీ ఏకంగా స్టార్ హీరోతో ప్రేమలో పడిందని దీంతో టూరింగ్, డేటింగ్ అంటూ సినిమా ఇండస్ట్రీపై పెద్దగా దృష్టి సారించడం లేదని మరికొందరు చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే కొందరు దర్శకనిర్మాతలు ఈ బ్యూటీకి ఉన్నటువంటి టాలెంట్ ని చూసి సినిమా అవకాశాలు ఆఫర్ చేస్తున్నప్పటికీ ఏదో వంక చూపుతూ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేస్తుందట. పోనీ ఆ స్టార్ హీరోతో నటిస్తున్న చిత్రమైనా షూటింగ్ పూర్తి చేసుకుందా ..? అంటే అది కూడా లేదు. దీంతో అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ ఆ స్టార్ హీరోయిన్ హీరో ప్రేమ మైకంలో మునిగిపోయి కెరీర్ని నాశనం చేసుకోబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వెళుతుందో లేక మధ్యలోనే ఆగిపోతుందో చూడాలి.

- Advertisement -