Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఒక రాజమౌళి, ఒక కొరటాల శివ, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఒక పూరీ జగన్నాథ్.. వీళ్లంతా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు. టాలీవుడ్ కు దేశవ్యాప్త, ప్రపంచ వ్యాప్త గుర్తింపును తీసుకొచ్చారు. అప్పటి వరకు ఒక లెక్క.. వీళ్లు వచ్చాక ఇంకో లెక్క అన్నట్టుగా ఈ డైరెక్టర్ల పంథానే వేరు. ఇదివరకు ఉన్న ఒక మూస ధోరణికి బ్రేక్ పెట్టి సరికొత్త పంథాలో సినిమాలు తీసి విజయం సాధించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు.
నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి ఒక రచయితగా అడుగుపెట్టారు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. నువ్వే నువ్వే సినిమాతో ఆయన డైరెక్టర్ గా మారారు. అప్పటి వరకు ఆయన చాలా సినిమాలకు మాటలు అందించారు. కథలు రాశారు. నువ్వే నువ్వే సినిమా హిట్ అవడంతో ఇక త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. డైరెక్టర్ గా ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఉన్న టాప్ హీరోలు అందరితో త్రివిక్రమ్ సినిమాలు తీశారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు.
Trivikram Srinivas : ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా?
ఆంధ్రాలో ఓ మారుమూల పల్లెటూరులో జన్మించిన త్రివిక్రమ్ కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. కానీ.. సినిమాలపై ఉన్న ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ల పాటు కష్టపడ్డారు. ఎన్నో రోజులు తిండి లేకుండా ఉన్నారు. చిన్న చిన్న రూమ్స్ లో ఉంటూ.. ఇండస్ట్రీలో ట్రై చేసేవారు. ముందు రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యారు. అయితే.. ఇదంతా ఓవర్ నైట్ జరగలేదు. దాని కోసం కొన్ని ఏళ్ల పాటు ఆయన కష్టపడ్డారు. చివరకు తన లక్ష్యాన్ని చేరుకొని ఇప్పుడు ఇండస్ట్రీలోనే గొప్ప డైరెక్టర్ అయ్యారు. భీమవరంలో పుట్టిపెరిగిన త్రివిక్రమ్.. అక్కడే చదువుకున్నారు. మంచి జాబ్ వచ్చినా కూడా తాను జాబ్ చేయనని.. ఇండస్ట్రీలోకి వెళ్తా అని తన ఫ్యామిలీకి చెప్పారట. దీంతో నీకు నచ్చిన దారి ఎంచుకో అని చెప్పారట తన తండ్రి.