Tollywood Hero: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో మాధవన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్న మాధవన్ సఖి సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతోనే లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు.
తెలుగు తమిళం కలిపి మొత్తం ఆరు భాషల్లో తన అద్భుతమైన నటనను కనబరిచాడు మాధవన్. ఇక ప్రస్తుతం మాధవన్ నటించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తాజాగా 75వ కేన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న మాధవన్ ఈ సినిమా ప్రీమియర్ ను ఒక రేంజ్ లో కనబరిచాడు. ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ తాను నాలుగేళ్లపాటు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలను వెల్లడించాడు.

Tollywood Hero: మాధవన్ ఈ సమయం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు!
లాక్ డౌన్ ఆ సమయంలో రెండు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని మాధవన్ తెలిపాడు. ఆ తర్వాత వచ్చిన రాకెట్రీ సినిమా షూటింగ్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చాడు. ఇక తాను మంచి హిట్ సాధించిన సినిమా విక్రమ్ వేద అని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో మాధవన్ కి నిరంతరమైన భయం ఉండేది అని తెలిపాడు.
ఇక విక్రమ్ వేద తర్వాత మాధవన్ నటించిన ప్రతి ఒక్క సినిమా ప్లాప్ ను చవిచూసింది. ఇక తెలుగులో విక్రమ్ నటించిన సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాల తో మాధవన్ ఊహించని స్థాయిలో ఘోరమైన పరాజయాలను చవి చూసాడు. ఇక మాధవన్ రాబోయే సినిమాల విషయానికొస్తే ద రైల్వే మెన్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.