Tollywood Heroes: సాధారణంగా స్టార్ హీరోల అన్నాక వాళ్ళు నటించే సినిమా పూర్తి చేసుకున్నాక ఆ ఒత్తిడి మొత్తం పోవడానికి ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక టూర్ వేస్తారు. ఏదో ఒక వెకేషన్ కైనా వెళ్తారు. ప్రస్తుత కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు తమ ఫ్యామిలీస్ తో వెకేషన్ ల పేరుతో ఫుల్ గా చిల్ అవుతున్నారు.
ఇక వెకేషన్ ల విషయానికి వస్తే స్టార్ హీరోల సతీమణులు ఏ మాత్రం తగ్గరు. నెలకు రెండు సార్లు అయినా ఏదో ఒక వెకేషన్ పేరుతో ఫుల్ గా చిల్ అవుతూ వాళ్ల తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోలు వెకేషన్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ల గురించి మనం తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి మే మూడో తారీఖు ఇతడి వెకేషన్ స్టార్ట్ అయింది. మొదటిగా అమెరికా వెళ్ళాడు. యూరప్ ఖండం మొత్తాన్ని ఒక రౌండ్ వేసాడు. నిజానికి ఈ ట్రిప్ తన సతీమణి సురేఖ తో చాలా కాలం తర్వాత ప్లాన్ చేసిన ట్రిప్ అన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Tollywood Heroes: మహేష్ బాబు వెకేషన్ పేరుతో వీళ్ళతో చిల్ అయ్యాడు!
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఏకంగా రెండుసార్లు ట్రిప్ ను ఎంజాయ్ చేశాడు. సర్కారి వారి పాట సినిమా విడుదలకు ముందు ఒక ట్రిప్ ను ఎంజాయ్ చేశాడు. అనంతరం ఏప్రిల్ నెల చివరిలో ఒక ట్రిప్ తో చిల్ అయ్యాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ యూరప్ ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన భార్యతో కలిసి ఒక ట్రిప్ లో ఉన్నట్లు అర్థమవుతుంది. పుష్ప సినిమా షూటింగ్ అనంతరం రెస్ట్ లేకుండా పనిచేసి చిత్రీకరణ అయిన వెంటనే బన్నీ తన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్ళిపోయాడు.