Tollywood Heroine: ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోయిన్లు తమ వయసుకు తగ్గ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకప్పటి హీరోలు మాత్రం ఇప్పటికీ హీరోలు గానే దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ పవర్ చూపిస్తున్న సీనియర్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినా సిమ్రాన్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి బ్రేక్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీతో మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అంతే కాకుండా మరో హీరోయిన్ ప్రియమణి కూడా మధ్య విడుదలైన ఫ్యామిలీ మ్యాన్, నారప్ప సినిమాల్లో కూడా సహాయ పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
వీటితో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను దోచుకున్న భూమిక కూడా రీ ఎంట్రీ తో మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆమె ఎంసీఏ, రూలర్, సిటీ మార్, ఇదే మా కథ, పాగల్ వంటి సినిమాలలో తన పాత్రలతో బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా స్నేహ కూడా వదిన పాత్రలతో బాగా అదరగొడుతుంది.
Tollywood Heroine: వీళ్లు కూడా రీ ఎంట్రీతో బాగా అదరగొడుతున్నారు..
వీరితో పాటు రేణు దేశాయ్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా ఒకప్పటి హీరోయిన్ సంగీత కూడా ఎంట్రీ తో తన పాత్రలతో బాగా ఫిదా చేస్తుంది. మీరాజాస్మిన్ కూడా రీ ఎంట్రీ తో భలే హాట్ గా మారిపోయింది. ఈమె కూడా పలు సినిమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా సదా, రమ్యకృష్ణ, మీనా, ఇంద్రజ, రాశి ఇలా పలువురు హీరోయిన్లను రీ ఎంట్రీ తో తమ హవా ఏంటో చూపిస్తున్నారు.