Tollywood Heroine : తెలుగు సినీ ప్రియులకు అలనాటి అందాల భామ టబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటి స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలిగింది.
ఇక ప్రస్తుతం టబు పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలో టబు మెయిన్ రోల్ చేసింది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ ప్రేక్షకులతో కూడా హీరోయిన్ గా మంచి ర్యాపో పెంచుకుంది. ప్రస్తుతం టబు బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బీ టౌన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇక టబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక మీడియాతో ముచ్చటపెట్టిన టబు పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అజయ్ దేవగన్, దర్శకుడు విశాల్ భరద్వాజ్ లు నాకు రక్షణ కవచం లాంటివారు అని వెల్లడించింది.

Tollywood Heroine : టబు కు వీళ్లతో ఉన్న రిలేషన్ ఇదే!
ఆ ఇద్దరితో తనకున్న అనుబంధాన్ని టబు వెల్లడించింది. ఆమెతో చాలా సంవత్సరాలుగా అజయ్ దేవగన్, విశాల్ తో మంచి స్నేహం ఉందని తెలిపింది. అంతేకాకుండా నా మంచి చెడులు వాళ్ళిద్దరికీ బాగా తెలుసని చెప్పుకొచ్చింది. ఇక విశాల్ తో మంచి రిలేషన్ ఉంది, టబు ఆమె మీడియా ముందు బయట పెట్టింది. ఇక అజయ్ దేవగన్ తో కూడా ఈమె ఫ్రెండ్షిప్ పరంగా మంచి బాండ్ ఉన్నట్లు తెలియ జేసింది. ప్రస్తుతం టబు మాటలు విన్న అజయ్ దేవగన్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.