Tollywood Heroine: అతనితో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. ఈ నటి స్టోరీ అయిన సక్సెస్ అవుతుందా?

Akashavani

Tollywood Heroine: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రియాంక జవాల్కర్ అనే పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన అమ్మడు అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. తొలి సినిమాతోనే ప్రియాంక ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.

ఇక ఆ తర్వాత వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో యువత ను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఇక తన అందం గురించి మనందరికీ తెలుసు. మొత్తానికి ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రియాంక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకొని తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు గురించి తాజాగా ఒక రూమర్ నెట్టింట్లో ప్రచారం అవుతుంది. అదేమిటంటే ప్రియాంక క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు ఎడతెరిపి లేకుండా ప్రచారం అవుతున్నాయి. తాజాగా ప్రియాంక సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోను పంచుకుంది.

Tollywood Heroine: అతనితో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. ఈ నటి స్టోరీ అయిన సక్సెస్ అవుతుందా?
Tollywood Heroine: అతనితో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. ఈ నటి స్టోరీ అయిన సక్సెస్ అవుతుందా?

Tollywood Heroine: ప్రియాంక జవాల్కర్ ఇతడితో ప్రేమాయణం నడుపుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి!

ఇక ఆ పోస్టుకు వెంకటేష్ అయ్యర్ కామెంట్ పెట్టడంతో సోషల్ మీడియా ప్రియులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరి రిలేషన్ ను త్వరలోనే అధికారికంగా బయట పెడతారా.. లేక కొంతకాలం హిడెన్ ప్రేమాయణం నడుపుతున్నారా.. అనే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి పుకార్ల వెనకాల నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి చూడాల్సిఉంది.

ఇక ప్రియాంక జవాల్కర్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం లో జన్మించింది. ఆమె స్కూలింగ్ మొత్తం అనంతపురంలోనే కంప్లీట్ చేసింది. ఇక పెద్ద చదువులు మొత్తం హైదరాబాదులో కంప్లీట్ చేసింది.

- Advertisement -