Tollywood Heroines: ఆసక్తి ఉండాలే గానీ, సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు – హీరోయిన్స్‌ను రీ ఎంట్రీ ఛాన్సెస్ బాగానే వస్తున్నాయి. గతంలో కంటే ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ తెరపై తళుక్కుమనేందుకు ఆవురావురంటున్నారు. చిత్రపరిశ్రమలో తమ అందం, అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేరు. అందుకే, అవకాశం ఉన్నప్పుడే హీరోయిన్లు వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఒప్పుకుంటూ క్రేజ్‌తో పాటు భారీగా డబ్బును సంపాదించుకుంటారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఫేడ్ అవుట్ అయ్యే దశకు వచ్చారు అంటే వారికి అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతారు. దీనికి కారణం రెండు. ఒకటి వయసు మీదపడటం..రెండు పెళ్లి చేసుకోవడం. ఈ విధంగా ఇండస్ట్రీ నుంచి దూరమైన ఎంతో మంది హీరోయిన్లు వారి వైవాహిక జీవితంలో స్థిరపడిన తర్వాత కొందరు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ వ్యాపారరంగంలో కొనసాగుతూ ఉంటే.. మరి కొంత మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వారి వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా ఉన్న పలువురు హీరోయిన్స్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Tollywood Heroines: గ్లామర్ కాపాడుకునేది ఇందుకే..
ప్రస్తుతం అలాంటి వారిలో సిమ్రాన్, భూమిక, ప్రియమణి వంటి హీరోయిన్స్ ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అక్క, వదిన పాత్రలో నటించడమే కాకుండా తల్లి పాత్రలో కూడా నటిస్తూ వెలుగున్నారు. సోనాలి బింద్రే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈమెతో పాటు జెనిలియా కూడా టాలీవుడ్ కి తిరిగి రావడానికి చాలా రోజులుగా ట్రై చూస్తోంది. రేణు దేశాయి, మీరా జాస్మిన్ లు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నాలుగు పదుల వయసులో సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రమ్య కృష్ణ, శివగామిగా ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంటే, ఇదే దారిలో అప్పటి హీరోయిన్స్ ఆమనీ, ఇంద్రజ, రాశి, అమల వంటి అందాల భామలు ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి… ఇప్పుడున్న యంగ్ హీరోలకు తల్లి పాత్రల ద్వారా మరోసారి ఇండస్ట్రీలో కెరియర్ కొనసాగిస్తున్నారు. గ్లామర్ కాపాడుకునేది ఇందుకే అని ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి.