Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుంచి రాష్ట్ర రాజకీయాలలో బిజీగా ఉంటూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈయన వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకీ రీ ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన సినిమాల విషయానికి వస్తే.. ఈయన హరిహర వీరమల్లు భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం చేసుకున్నాయి.
ఇకపోతే భవదీయుడు భగత్ సింగ్ త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నప్పటికీ ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఇకపోతే సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన వినోదయ సీతమ్ అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇక సముద్రఖని దర్శకత్వంలోని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన విలువడలేదు.ఈ సినిమా కోసం సముద్రఖని సాయి ధరంతేజ్ తనకు వస్తున్న ఆఫర్లను కూడా హోల్డ్ లో పెట్టారు.
Pawan Kalyan: సినిమాలను పూర్తిగా పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్…
ఇకపోతే హరిహర వీరు మల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాల దర్శక నిర్మాతలు సైతం ఆలోచనలో పడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగులలో ఎప్పుడు పాల్గొంటారు ఈ సినిమాలో ఎప్పుడు పూర్తవుతాయో వారికి కూడా తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్లలో బిజీగా ఉండి అనంతరం రాజకీయాలలో బిజీ అయ్యారు.కౌలు రైతు భరోసా అంటూ మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ విధంగా ఆయన రాజకీయ పర్యటనలో భాగంగా ఒత్తిడికి గురవడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన సినిమా షూటింగ్లలో పాల్గొనకపోవడం వల్ల ఆదర్శక నిర్మాతలు ఇతర సినిమాలను చేయకపోవడం,పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా పూర్తి చేయకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఈయన ఒక్కరి వల్ల ఇంతమంది ఇబ్బందులు పాలవుతున్నారని సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.