Tollywood: కొన్ని గంటల నుండి యూట్యూబ్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదే యాంకర్ సుమ, ఎన్టీఆర్ మధ్య జరిగిన వార్. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ పాల్గొన్న సంగతి తెలిసింది. ఆ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్ అందరికీ తన సినిమా గురించి ఒత్తిడి పెంచకూడదు అని సమయం వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను అని తెలియచేశాడట.
కానీ వెంటనే సుమ ఆ ఈవెంట్ లో.. ఎన్టీఆర్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అని మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఎన్టీఆర్ సుమ వైపు సీరియస్ గా చూస్తూ కనిపించాడు. ఇక సుమ మైక్ ఇవ్వటంతో.. వెంటనే ఎన్టీఆర్ తీసుకొని సీరియస్ గా వాళ్ళు అడక్కపోయినా నువ్వు చెప్పేసేలా ఉన్నావు అంటూ మాట్లాడాడు. దీంతో నిజంగానే ఎన్టీఆర్ సుమపై ఫైర్ అయినట్లు కనిపించాడు.
ఇక దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎన్టీఆర్ అలా సీరియస్ అయ్యాక సుమ మరో మాట కూడా మాట్లాడలేదని.. ఈవెంట్ పూర్తయ్యాక తను అప్సెట్ అయ్యి ఏడ్చినట్లు తెలిసిందని ఒక వార్త వినిపిస్తుంది. ఇంత వెంటనే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది.
Tollywood:
మామూలుగా రాజీవ్ కనకాలకు, ఎన్టీఆర్ కు మంచి స్నేహబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉంటారు. అయితే ఈవెంట్లో ఎన్టీఆర్ సుమా పై ఫైర్ అవటంతో వెంటనే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఎన్టీఆర్ ఆ విషయాన్ని మళ్లీ అంతగా పట్టించుకోలేదు అని.. తొందరపాటులో అలా జరిగింది అని ఎన్టీఆర్ అన్నాడని తెలిసింది. సుమ కూడా ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు అని తెలిసింది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే సుమ దీని గురించి స్పందించే వరకు వేచి చూడాల్సిందే.