Tollywood: సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే అది కచ్చితంగా ఏదో ఒక గట్టి విషయమే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్ సూసైడ్ చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రమైన విషాదంలో ముంచారు. చాలా వరకు ఆర్థిక పరిస్థితుల వల్ల, అవకాశాలు లేకపోవడం వల్ల సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇప్పటికే టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణాలతో తను అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోయారు. చాలావరకు ఇండస్ట్రీలో చిన్న హీరోలను పట్టించుకునే దర్శకనిర్మాతలు లేరు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని మరణించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
ఓ యంగ్ హీరో కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 2016 లో వర ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా కుందనపు బొమ్మ. ఇందులో చాందిని చౌదరి, సుధాకర్ కోమాకులనే కాకుండా మరో కీలక పాత్రలో సుధీర్ వర్మ కూడా నటించాడు. ఇక ఆ సుధీర్ వర్మనే తాజాగా వైజాగ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Tollywood
అయితే అతడు అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడటం వల్ల ఆ బాధలు తట్టుకోలేక మన స్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇక ఈయన మరణ వార్తను విని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆయనతో కలిసి నటించిన సుధాకర్ ఫేస్ బుక్ వేదికగా అతడు లేదన్న విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇక పోలీసులకు సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసుకొని పలు విచారణ కూడా చేపట్టారు. ఇక ఆ హీరో కుటుంబ సభ్యులు ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగారు.