Trisha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి త్రిష ఒకరు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇప్పటికీ కూడా సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే కెరియర్ మొదట్లో కొంతమంది త్రిష కూడా అందరిలాగే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారంటూ తాజాగా త్రిష కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నటి మీరా మిథున్ గతంలో సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఈమె త్రిష గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. కెరియర్ మొదట్లో త్రిష పట్ల ఒక హీరో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఈమె తెలిపారు. తాను నటించిన సినిమాలోని నేను కూడా నటించానని అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక హీరో త్రిష ప్రైవేటు పార్ట్స్ పై అందరి ముందు చాలా అసభ్యంగా తాగారు అంటూ ఈమె కామెంట్స్ చేశారు.
Trisha: సినిమా కోసం భరించిన త్రిష…
ఆ హీరో త్రిష పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో నాకు మల్లు మండిపోయిందని త్రిషకి కూడా అదే ఫీలింగ్ వచ్చినప్పటికీ తాను ఏమీ అనలేకపోయిందని తెలిపారు. ఆ హీరో పై తాను ఎక్కడ అరిస్తే ఆ సినిమా నుంచి తనని తప్పిస్తారేమో అన్న భయంతోనే త్రిష మౌనంగా ఆ హీరో టార్చర్ భరించింది అంటూ మీరా మిథున్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ కి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మరి ఏమాత్రం స్టార్డంలేని చిన్నచిన్న హీరోయిన్స్ పరిస్థితి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.