trivikram and sunil used to tease prakash raj
trivikram and sunil used to tease prakash raj

Trivikram – Sunil : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు, దర్శకులు, నిర్మాతలు ఫ్రెండ్స్ గా ఉంటారు. కొందరైతే ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. ఒకే రూమ్ లో ఉంటూ ఇండస్ట్రీలో ట్రై చేసి ఇప్పుడు పెద్ద స్టార్లు అయిన వాళ్లూ ఉన్నారు. ఉదాహరణకు త్రివిక్రమ్, సునీల్ నే తీసుకోవచ్చు. ఇద్దరిదీ బీమవరమే. ఇద్దరూ ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. ఒకరు డైరెక్టర్ గా, మరొకరు కమెడియన్ గా అవకాశాల కోసం తిండి లేని రాత్రులు ఎన్నో గడిపారు. త్రివిక్రమ్ రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ ఏ సినిమా కథ రాసినా అందులో ఒక క్యారెక్టర్ ను ఖచ్చితంగా సునీల్ కోసం రాసుకునేవారు. అది వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్. అది ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతోంది.

ఇక.. త్రివిక్రమ్, సునీల్.. ఇద్దరూ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్నాళ్లు మూడు పూటలా తిండి కూడా లేని రోజులను గడిపారు. ఒక్కోసారి ప్రకాశ్ రాజ్ ఇంటికి వెళ్లి.. వాళ్ల ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఏం ఉంటే అది తినేవారట. అందులో ఉండే కూల్ డ్రింక్స్, మందు బాటిల్స్ ను కూడా తమతో పాటు తీసుకొని వెళ్లిపోయేవారట. అసలు.. త్రివిక్రమ్, సునీల్.. ఇద్దరూ వస్తున్నారంటే చాలు ప్రకాశ్ రాజ్ తెగ భయపడిపోయేవారట.

Trivikram – Sunil : ప్రకాశ్ రాజ్ కోసం కూడా మంచి పాత్రలు రాసిన త్రివిక్రమ్

కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ప్రకాశ్ రాజ్ కోసం కూడా త్రివిక్రమ్ మంచి క్యారెక్టర్స్ రాసేవారు. అలా వచ్చిందే నువ్వు నాకు నచ్చావ్. ఆ సినిమాకు కథను అందించింది త్రివిక్రమే. ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ ది ఎంత ముఖ్య పాత్రో అందరికీ తెలుసు. సునీల్ కు అందులో మంచి క్యారెక్టర్ ను రాశారు త్రివిక్రమ్. వాళ్ల మధ్య అంత అనుబంధం ఉండేది. మొన్నటి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వరకు కూడా ప్రకాశ్ రాజ్ కు మంచి క్యారెక్టర్స్ రాసేవారు త్రివిక్రమ్. కెరీర్ మొదట్లో మాత్రం ప్రకాశ్ రాజ్ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి ఏది దొరికితే అది తినేసేవారట సునీల్, త్రివిక్రమ్. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీలీల మరో పాత్రలో నటిస్తోంది.