Trivikram: పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం బ్రో. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన వినోదయ సీతం అనే సినిమాని తెలుగులో బ్రోగా రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించగా..ఇక త్రివిక్రమ్ ఈ సినిమాకి కథనం , మాటలు అందిస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న అన్ని సినిమాలకు త్రివిక్రమ్ దగ్గరుండి మరి అన్ని పనులు చూసుకుంటున్నాడు. త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ కి ఉన్న అనుబంధం వల్ల పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ ఓకే చెప్పిన తర్వాతనే సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జులై 28వ తేదీ వివిధ భాషలలో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా ఒక సినిమాకు దర్శకత్వం వహించే దర్శకుడు కూడా హీరోకి సమానంగా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు.

Trivikram: కోట్లలో రెమ్యూనరేషన్…
అయితే ఈ బ్రో సినిమా విషయంలో.. ఈ సినిమాకి కథనం మాటలు అందించిన త్రివిక్రమ్ కూడా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్న త్రివిక్రమ్ ఏకంగా రూ.20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ప్రస్తుతం ఒక వార్త ప్రచారం అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో అర్థమవుతుంది. అయితే మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి ఉన్న స్నేహం వల్లనే అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.