Trivikram: ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అందరికీ బాగా తెలుసు. వెండితెరపై మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను రాసే డైలాగులు, మాటలు అద్భుతంగా ఉంటాయి. దీని కారణంగానే ఇతనికి మాటల మాంత్రికుడు అని సినీ ఇండస్ట్రీ పేరు పెట్టింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే ప్రతి చిత్రాలు కూడా ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. ఇక త్రివిక్రమ్ తీసే సినిమాలు మాయాజాలం లాగా ఉంటాయని అందరికీ తెలుసు.
మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా సినిమాలు తీసి అందరినీ అలరిస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో అనే సినిమాను తీసి ఇండస్ట్రీ హిట్ ను కొట్టాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ చిత్రం చేస్తున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా త్రివిక్రమ్ లో ఖరీదైన కారును కొనుగోలు చేసాడు. దానికి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
కారు దగ్గర నిలబడి తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా.. అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ కార్ ను కొనుగోలు చేశాడు. అయితే త్రివిక్రమ్ తన భార్య సౌజన్య కోసం ఈ కారును కొనుగోలు చేశాడని.. సౌజన్యకు త్రివిక్రమ్ ఈ కారును గిఫ్ట్ గా ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ సతీమణి సౌజన్య గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఎందుకంటే ఆమె తరచూ అప్పుడప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఆమె ఓ క్లాసికల్ డాన్సర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆమె పలు వేదికలపై ప్రదర్శన ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఏదేమైనా త్రివిక్రమ్ అదిరిపోయే కార్ ను కొనుగోలు చేశాడు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఆ కారుతో నిలబడి ఉన్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Trivikram: త్వరలోనే అభిమానుల ముందుకు రానున్న త్రివిక్రమ్, మహేష్ సినిమా..
ఇక త్రివిక్రమ్ సినిమా విషయానికొస్తే షూటింగ్ గ్యాప్ వల్ల మహేష్ ఇంకా త్రివిక్రమ్ అభిమానులు వీరిద్దరి కాంబో కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఖలేజా సినిమా ఎంతగానో అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇందులో ఉండే కామెడీ, మాటలు, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే త్రివిక్రమ్ ఇంకా మహేష్ అభిమానులు విధి కాంబో కోసం చాలా ఎదురు చూస్తున్నారు.