TV Actress: ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీమణుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొందరు నటీమణులు ఇలా కొన్ని కారణాలవల్ల అర్ధాంతరంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.గత కొన్ని రోజులుగా వరుసగా టీవీ ఆర్టిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా ఈ విషయం మరచిపోకముందే మరొక బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఆ బుల్లితెర నటి ఎవరు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయానికి వస్తే..
ప్రముఖ ఒడియా టీవీ సీరియల్ లో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి రేఖ ఈ నెల 18వ తేదీ ఆత్మహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఈమె ఒక అద్దె ఇంట్లో నివాసం ఉండేది.అయితే ఈమె పెళ్లి కాకుండానే గత కొన్ని సంవత్సరాల నుంచి సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉంది. ఇకపోతే తాజాగా ఈమె తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఎంతసేపటికీ తాను ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది.

TV Actress: సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న నటి..
రష్మీ రేఖ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా సూసైడ్ నోట్ కూడా రాయడం అందరిని కలచివేసింది. తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ లో రాయడమే కాకుండా ఐ లవ్ యు సాన్ అని కూడా రాశారు. అయితే తన మరణానికి కారణం ప్రేమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక రష్మీ తల్లిదండ్రులు ఈ ఘటన పై స్పందిస్తూ శనివారం సాయంత్రం తమ కూతురికి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదని మరికొంత సమయానికి సంతోష్ ఫోన్ చేసి రష్మి చనిపోయిందని మాకు సమాచారం అందించారని తెలిపారు. ఇక సంతోష్ తన కూతురు ఇద్దరు కలిసి ఉంటున్నారనే విషయాన్ని కూడా దాచారని ఇంటి ఓనర్ ఆ విషయం చెప్పే వరకు తనకు తెలియదని రష్మీ తండ్రి తెలిపారు.అయితే ఈమె చావుకు ప్రేమే కారణమా లేకపోతే మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.