TV Anchors: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీలకు వేధింపులు పెరిగిపోయాయి. అయితే గతంలో ఈ వేధింపుల గురించి. కానీ వారి వేధింపులు మితిమీరి పోవటంతో సెలబ్రిటీలు కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బుల్లితెర యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయని ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. వారి డ్రెస్సింగ్, ఫోటో షూట్స్, వీడియోలను పై ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే అనసూయ వాటిపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ట్రోలర్స్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇంత కాలం రష్మీ వాటిగురించి పెద్దగా పట్టించుకునేది కాదు. అయితే రష్మి కూడా తన పద్దతి మార్చుకుంది. తాజాగా ఒక నెటిజన్ రష్మిని ట్యాగ్ చేసి దారుణంగా ట్రోల్ చేశాడు. దీంతో రష్మి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ లో కేసు పెడతానంటూ భయపెట్టింది. దెబ్బకు దండం పెట్టీ కాళ్ళ బేరానికి వచ్చాడు.
ఇటీవల ‘ హైపర్ ఆదితో రష్మీ గౌతమ్ వైల్డ్ రొమాన్స్ చేస్తుంది. సుడిగాలి సుధీర్ తో కేవలం టీఆర్పీ కోసం మాత్రమే చనువుగా ఉంటుంది. నిజానికి రష్మీ ఆదిని ఎంతగానో ఇష్టపడుతుంది.. అని కామెంట్ పెట్టడమే కాకుండా రష్మీని ట్యాగ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ మీద రష్మీ ఫైర్ అయ్యింది. గతంలో ఇలాంటి వేధింపులు సహించాను. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేయడమే కాకుండా నన్ను ట్యాగ్ చేసేంత ధైర్యం చేశావంటే… ఇక సహించేది లేదు… దీనికి నువ్వు అనుభవిస్తావు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
TV Anchors: క్షమించండి మేడం…
దెబ్బకు ఆ నెటిజన్ కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇకపై చేయను మేడమ్. నన్ను క్షమించండి. నాకు ఫ్యామిలీ ఉంది.. అంటూ దండం పెట్టి వేడుకున్నాడు. అయినా కూడా వదిలేది లేదు. నువ్వు ఈ క్షమాపణ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు చెప్పుకో అంటూ రష్మీ రెచ్చిపోయింది. ఈ క్రమంలో సదరు నెటిజన్ రష్మీని బ్రతిలాడుతూ చేసిన ఇంస్టాగ్రామ్ చాట్ హిస్టరీ స్క్రీన్ షాట్ తీసి రష్మి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . అంతే కాకుండా ఈ వ్యక్తి మీద నేను చర్యలు తీసుకోవాలా వద్దా… అని ఒక పోల్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ కి కొందరు నెటిజెన్స్ స్పందిస్తూ..ఈసారికి వదిలేయమంటుంటే… మరి కొందరు మాత్రం ఇలాంటి వాళ్ళను వదలకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.