Uday Kiran: ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సినిమా అందుకున్నారు ఇలా ఈ సినిమా తర్వాత ఈయన వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలో అందుకోవడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ వైపు తిరిగి చూసింది.ఇలా ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారడంతో ఏకంగా చిరంజీవి తన కుమార్తె సుస్మితను ఇచ్చి తనకు వివాహం చేయాలని భావించి ఉదయ్ కిరణ్ తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయింది. ఇక ఉదయ్ కిరణ్ తిరిగి సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం సరైన హిట్ అందలేదు.
ఇలా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడం కొత్త సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈయన పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఈయన 2012 వ సంవత్సరంలో విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఉదయ్ కిరణ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తద్వారా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఆ డిప్రెషన్ నుంచి బయటపడే మార్గం తెలియకే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
Uday Kiran: చనిపోయినట్టు కల వచ్చిందా..
ఇకపోతే ఉదయ్ కిరణ్ గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉదయ్ కిరణ్ చనిపోవడానికి వారం ముందు ఆయనకు ఒక భయంకరమైన కల వచ్చిందట అయితే ఆ కలలో జరిగిన విధంగానే ఉదయ్ కిరణ్ చనిపోవడం జరిగింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సంచలనగా మారింది.ఉదయ్ కిరణ్ ఓ రోజు రాత్రి నిద్రపోతూ ఉండగా తన భార్య ఇంట్లో లేని సమయంలో తాను ఆత్మహత్య చేసుకున్నారని కల వచ్చిందట. ఇలా మరుసటి రోజు ఉదయం నాకు ఇలాంటి కల వచ్చిందని తన భార్య దగ్గర చెప్పడంతో మీరు డిప్రెషన్ లో ఉండటం వల్ల మీకు అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. ఆ ఆలోచనలను పక్కనపెట్టి మీ మైండ్ నుప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పారట అయితే ఇలా తన భార్యకు చెప్పిన వారం రోజులలోనే ఉదయ్ కిరణ్ కూడా తన సొంత ఫ్లాట్ లో ఉరి వేసుకొని చనిపోయారంటూ ఈ వార్త వైరల్ గా మారింది.