Uma Maheshwari: దివంగత ఎన్టీఆర్ చిన్న కూతురు కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించగా ఆమె ఉరి వేసుకోవడం వల్ల మరణించింది అని తెలిపారు.
ఇక పోస్టుమార్టం అనంతరం ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక ఈమె ఆగస్టు ఒకటి సోమవారం ఉదయం తన గదిలోకి వెళ్లగా పనిమనిషి తలుపు తట్టినా కూడా లోపలి నుండి ఎటువంటి స్పందన రాకపోవటంతో పని మనిషి వెంటనే ఉమామహేశ్వరి చిన్న కూతురు దీక్షిత కు ఫోన్ చేసి సమాచారం అందించిందట.
దీంతో దీక్షిత తన భర్తతో కలిసి తన పుట్టింటికి ఆ తలుపులు బలవంతంగా తెరిచి చూసేసరికి చున్నీకి వేలాడుతూ కనిపించిందట. వెంటనే బాలకృష్ణకు, చంద్రబాబుకు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు ఫోన్ చేసి సమాచారం అందించారట. తన పార్టీవదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని.. తన తల్లి కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యతో పాటు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు అని తన కూతురు దీక్షిత తెలిపింది.
ఇక దీక్షిత తండ్రి శ్రీనివాస్ రావు వ్యాపార లావా దేవి కోసం బయటకు వెళ్లగా మూడు రోజుల నుంచి ఆయన ఇంట్లో లేరట. విషయం తెలియటంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి భౌతికాయానికి ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించారు. తన పెద్ద కూతురు అమెరికా నుంచి వచ్చాక అంత్యక్రియలు జరగనున్నాయి.
Uma Maheshwari: ఉమామహేశ్వరి చివరి కోరిక ఇదే..
ఉమామహేశ్వరి గురించి ఆమె మనస్తత్వం గురించి అక్కడున్న పనివాళ్ళు, తన బంధువులు చెబుతున్నారు. ఎవరిని కూడా ఒక మాట అనదు అని అందరిని ఆప్యాయంగా చూసుకునేది అని చెబుతున్నారు. ఇక ఆమె నేత్రాలను తను ఇతరులకు దానం చేయాలని అనుకోగా తన కోరిక ప్రకారం తన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఇక ఆమె మంచి మనసు కారణంగా ఆమె నేత్రాలకు మరొకరికి దానం చేశారు.