Umair Sandu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించి తరచూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అలాగే మరి కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటపెడుతూ ఉంటారు. ఇలా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తు ఉంటాడు ఉమైర్ సందు. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఇతను బాలీవుడ్ సెలబ్రిటీలు గురించి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఇక ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
ఉమైర్ గతంలో అనేక ట్విట్టర్ ఎకౌంట్ల ద్వారా సెలబ్రిటీల గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసేవాడు. అయితే ఇప్పుడు ఒకే ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ బాలీవుడ్ సెలబ్రిటీల దగ్గరినుండి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు అందరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఉమైర్ సందు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక స్టార్ హీరో కొడుకు గే అయ్యాడు అంటూ ఉమైర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీ- టౌన్ లో సంచలనం రేపుతున్నాయి.
Umair Sandu: స్టార్ కిడ్స్ కు ఏమవుతుంది…
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఫోటో షేర్ చేస్తూ.. ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పుడు గే అయ్యాడట. అసలు ఈ స్టార్ కిడ్స్ కి ఏమవుతుంది? ఎందుకు వీళ్లంతా స్వలింగ సంపర్కులుగా మారిపోతున్నారు అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే సాధారణంగా టాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఉమైర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడతారు. కానీ బాలీవుడ్ సెలబ్రిటీల గురించి అతను చేసే వ్యాఖ్యలకు బాలీవుడ్ అభిమానులు మాత్రం ఏ విధంగా స్పందించకుండా చాలా సిల్లీగా తీసుకుంటూ అతను చేసే కామెంట్లను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.