Unni Mukundan : ప్రముఖ తెలుగు సినీ నటి సమంత అంటే తెలియని వారుండరు. తన అందం, అభినయంతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. అతి తక్కువ సమయంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.

ఏం మాయ చేసావే సినిమా తర్వాత వరుసగా చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఆమె తన మొదటి సినిమా సమయంలో నాగచైతన్య, సమంతలు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య సమంతలు పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరుపుకున్నారు. అయితే పెళ్లయినా 4 ఏళ్ల తర్వాత ఇద్దరు విడిపోయారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న కారణం ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు.

అయితే సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం కొంత కాలం ఎవరికి తెలియలేదు. కానీ సమంత నే స్వయంగా తనకున్న వ్యాధి గురించి అందరికీ ఓ వీడియో ద్వారా ఆ మధ్య తెలియజేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఇక సోషల్ మీడియ వేదికగా సమంత కు ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ లు చేశారు. ఇక ఇటీవల దీని పై స్పందిస్తూ మరో నటుడు మాట్లాడాడు. అయితే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతుంది.

ఇందులో ప్రధాన పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ ఈ సందర్భంగా.. మాట్లాడుతూ తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు యశోదలో సమంతతో కలిసి నటించా.. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్.. నటుడిగా నా విషయానికొస్తే కథ ఎలా ఉంది.. అందులో నా పాత్ర ఏమిటి అని చూస్తాను.. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను అనేది ఆలోచిస్తా..

నటుడిగా కొత్తదనం చూపించడం అలా ముఖ్యమే కదా.. సమంత చాలా డెడికేటెడ్.. హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్.. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు.. ఫైట్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్, బాగా చేశారు.. సెట్లో ఇతర ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడుతారు..

Unni Mukundan :  సమంత గురించి గొప్పగా మాట్లాడిన నటుడు..

అయితే సమంతకు మయోసైటిస్ ఉందన్న విషయం షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు.. షూటింగ్లో ఆమె చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు.. ఎప్పుడు తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నానని చెప్పలేదు.. సమంత పోస్ట్ చూసి బాధగా ఫీల్ అయ్యాను.. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ కచ్చితంగా మయోసైటిస్తో.. పోరాటం చేసి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.. అంటూ చెప్పుకొచ్చాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 5, 2022 at 3:30 సా.