Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె పెళ్లి తర్వాత పది సంవత్సరాలకు తల్లి కావడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మెగా వారసుడి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఏడు నెలల ప్రెగ్నెంట్ కావడంతో మరి కొద్ది రోజులలో ఉపాసన తల్లి కాబోతున్నారని వార్త అందరికీ సంతోషాన్ని కలిగించింది.ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ తరచూ వెకేషన్లకు వెళ్తూ తన భర్తతో కలిసి పూర్తి సమయాన్ని గడుపుతున్నారు.
తాజాగా ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి దుబాయ్ వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అక్కడ తన స్నేహితులు కజిన్స్ సమక్షంలో ఉపాసనకు పెద్ద ఎత్తున బేబీ షవర్ వేడుకను నిర్వహించారు.ఈ క్రమంలోనే ఉపాసన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా తనకోసం ప్రత్యేకంగా నటి అలియా భట్ పంపించినటువంటి గిఫ్ట్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Upasana: పుట్టబోయే బిడ్డ కోసం…
ఇంతకీ అలియా భట్ ఉపాసన కోసం ఎలాంటి గిఫ్ట్ పంపించారనే విషయానికి వస్తే… అలియా భట్ ప్రస్తుతం ఈద్ ఏ మమ్మ అనే క్లోతింగ్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని దుస్తులను ఉపాసన కోసం ఈమె ప్రత్యేకంగా పంపించారు.ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఏ విధమైనటువంటి దుస్తులు కంఫర్ట్ గా ఉంటాయి, పుట్టబోయే తన బిడ్డకు కూడా అవసరమయ్యే దుస్తులను కూడా అలియా పంపించారు. ఇక ఈ ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ ఆలియాకు కృతజ్ఞతలు తెలిపారు.