Upasana: మెగా కోడలు ఉపాసన కామినేని గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న మెగా కుటుంబానికి కోడలుగా మాత్రమే కాకుండా అపోలో వైద్య సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉపాసన తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఇలా మెగా కోడలిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ బిజిగా ఉంది. అంతే కాకుండా ఉపాసనా సోషల్ మీడియాలో లో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. అంతే కాకుండా అనేక సాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటుంది.
తాజాగా ఉపవాసగా మరొకసారి తన సంపాదన మొత్తం స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకుంది. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హౌజ్ ఆఫ్ టాటా వారి జోయా కొత్త స్టోర్‌ను ఉపాసన గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హౌజ్ ఆఫ్ టాటా వారి జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించింది ఉపాసన ప్రారంభించింది. ఈ క్రమంలో స్టోర్ ప్రారంభించింనందుకు యాజమాన్యం ఇచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని మహిళల కోసం విరాళంగా అందించింది . ఈ మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ కి విరాళంగా ఇచ్చింది. దీంతో అభిమానులు ఉపాసన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
Upasana: మహిళలకు చేయూత…
ఇదిలా ఉండగా ఉపాసన ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఉపాసన రాంచరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గ తేడా అదే డిసెంబర్లో ఉపాసన తాను తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా వారసుడు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భంతో ఉన్నప్పటికీ భర్త రామ్ చరణ్ తో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా వెకేషన్ కోసం ఈ జంట దుబాయ్ కి వెళ్ళగా అక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉపాసన శ్రీమంతం వేడుక నిర్వహించారు.