Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఇంటి పరువు ప్రతిష్టలను ఎంతో కాపాడుతూ మెగా కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఒక బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇలా మెగా కుటుంబ కీర్తి ప్రతిష్టలను ఉపాసన కాపాడుతూ వచ్చారు. అయితే తన భర్త విషయంలో ఒకసారి మాత్రం చాలా బాధపడ్డారని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
సాధారణంగా హీరోలు సినిమాలలో హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం సర్వసాధారణం అయితే కొంతమంది భార్యలు తమ భర్త అల హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి అస్సలు తట్టుకోలేరు. ఈ విషయంలో ఉపాసన కూడా ఒకానొక సమయంలో చాలా బాధపడ్డారని తెలుస్తోంది.రామ్ చరణ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం సర్వసాధారణమని ఈమె కూడా భావించారట కానీ కొన్నిసార్లు దర్శకులు అవసరం లేకపోయినా హీరోయిన్స్ ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు చేస్తూ ఉంటారని అలా తను కూడా ఓ సందర్భంలో చరణ్ విషయంలో బాధపడ్డారని తెలియజేశారు.
Upasana: కాజల్ తో రొమాన్స్ చేయడం నచ్చలేదు…
రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గోవిందుడు అందరివాడే.ఈ సినిమాలు అవసరం లేకపోయినా హీరో హీరోయిన్ మధ్య భారీగా రొమాంటిక్ సన్నివేశాలను పెట్టారని ఆ సినిమా సమయంలో చరణ్ కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేయడం తాను తట్టుకోలేకపోయాను అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఈమె తల్లిగా ప్రమోట్ కానుండడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.