Upasana: ఉపాసన రాంచరణ్ దంపతులు ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్నారు. ఆస్కార్ అవార్డు వేడుకలు అనంతరం ఇండియాకి వచ్చిన రామ్ చరణ్ తిరిగి తన భార్య ఉపాసనతో కలిసి దుబాయ్ కి వెళ్లారు. అక్కడ స్నేహితులు బంధుమిత్రుల సమక్షంలో ఉపాసన రాంచరణ్ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఉపాసన సన్నిహితులు దుబాయిలో తనకు పెద్ద ఎత్తున బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన బేబీ షవర్ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
ఈ క్రమంలోని ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫంక్షన్ లో భాగంగా ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా తెలుపు రంగు దుస్తులలో సందడి చేశారు.ఇక ఈ ఫంక్షన్ లో భాగంగా ఉపాసన వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఉన్నారు ఈ క్రమంలోనే ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అంటూ పెద్ద ఎత్తున నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ధరించిన ఈ వైట్ కలర్ లేస్ ఉన్నటువంటి ఈ డ్రెస్సు ఏకంగా 1.5లక్షల విలువ చేస్తుందని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Upasana: తెలుపు రంగు దుస్తులలో స్పెషల్ అట్రాక్షన్…
ఈ విధంగా ఉపాసన బంధువులు స్నేహితులు సమక్షంలో ఈ బేబీ షవర్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుక మొత్తంలో ఎక్కువగా తెలుపు రంగు అట్రాక్షన్ గా కనిపించింది. ఇకపోతే ఉపాసన రాంచరణ్ ఈ సందర్భంగా కలిసి దిగినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనపడుతుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ వికషన్ అనంతరం రామ్ చరణ్ తిరిగి ఇండియా చేరుకున్న తర్వాత శంకర్ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.