Upasana: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాల గురించి హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం అందరూ కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహం గురించి అందరికీ తెలిసింది. ఇంతకాలం వీరి స్నేహం గురించి తెలియని అభిమానులు మా హీరో గొప్పవాడు అంటే మా హీరో గొప్పవాడు అంటూ పోట్లాడుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో వీరి స్నేహబంధం గురించి ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించాడు. ఇలా వీరిద్దరూ మాత్రమే కాకుండా వీరి భార్యలు లక్ష్మీ ప్రణతి, ఉపాసన కూడా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి బయట ఎక్కువగా కనిపించనప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.
ఇటీవల మార్చి 26వ తేదీ లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఒక బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉపాసనా ఇచ్చిన కానుక లక్ష్మీ ప్రణతికి బాగా నచ్చటంతో ఎక్కడికి వెళ్లినా దాన్ని వెంటపెట్టుకొని వెళ్తున్నట్లు తెలుస్తోంది. అసలు లక్ష్మీ ప్రణతికి అంతగా నచ్చిన కానుక ఉపాసన ఏమి ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఒక హ్యాండ్ బ్యాగ్ ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రణతికి బాగా నచ్చటంతో ఎక్కడికి వెళ్లినా ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హ్యాండ్ బ్యాగ్ తో ఉన్న లక్ష్మీ ప్రణతి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Upasana: ఖరీదైన కానుక ఇచ్చిన ఉపాసన..
దీంతో ఉపాసన బహుమతిగా ఇచ్చిన ఆ హ్యాండ్ బ్యాగ్ ధర గురించి తెలుసుకోవటానికి నెటిజన్స్ సెర్చ్ చేయగా..దాని ధర తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన బహుమతిగా ఇచ్చిన ఆ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా 3 లక్షల.. 28 వేల.. 145 రూపాయలట. అంతే కాకుండా ప్రణతి కోసం 45000 విలువ చేసే ఓ డ్రెస్ ను కూడా ఉపాసన బహుమతిగా ఇచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వీరి స్నేహబంధం గురించి తెలుసుకున్న అభిమానులు ఎప్పటికీ వీరి బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.