Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జాతకంలో దోషాలు ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. గత పది సంవత్సరాలుగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రామ్ చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటే మరొకవైపు ఉపాసన తన వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉంది. అయితే ఈ పది సంవత్సరాలలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు పిల్లల గురించి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ వార్తలపై ఉపాసన స్పందిస్తూ .. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పిల్లల గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే రోజులు గడిచే కొద్దీ మెగా వారసుడి గురించి అటు మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ లో ఉపాసన తల్లి కాబోతున్నట్లు శుభవార్త అభిమానులతో పంచుకుంది. దీంతో కుటుంబ సభ్యులు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉపాసన తల్లి కాబోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి మెగా అభిమానులు ఆమెకు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. ఇక ఉపాసన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.
Upasana: ఆడబిడ్డ పుడితే విమర్శలు తప్పవా…
ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసన జాతకంలో దోషాలు ఉన్నాయని, ఉపాసనకి ఆడబిడ్డ పుడితే పాప పుడితే కలిసి రాదని, జాతక ప్రకారం.. ఆమెకు పాప పుడితే ఉపాసన క్రేజ్, ఫేమ్ విమర్శల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని.. అదే మగ బిడ్డ పుడితే మాత్రం మెగా వారసుడిగా మంచి గుర్తింపు పొందుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త తెలియటంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రామ్ చరణ్ కి మగ బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఇవన్ని పుకార్లు అంటూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.