Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లితండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వివాహం జరిగిన పది సంవత్సరాలకు వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇంతకాలం పిల్లల గురించి ఉపాసనకు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే సమయం వచ్చినప్పుడే పిల్లల్ని కంటామని ఉపాసన సమాధానం చెబుతూ వచ్చింది. ఇక గతేడాదే డిసెంబర్లో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి ఆనందం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా గర్భంతో ఉన్నప్పటికీ ఉపాసన విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కొంతకాలం క్రితం ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళిన రామ్ చరణ్ తనతో పాటు ఉపాసనని కూడా వెంట తీసుకువెళ్లాడు. ఇక ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. తాజాగా వీరిద్దరూ వెకేషన్ కోసం దుబాయికి చెక్కేశారు. దుబాయిలో రామ్ చరణ్, ఉపాసన తమ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన స్నేహితులు దుబాయ్ లో బేబీ షవర్ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Upasana స్నేహితుల సమక్షంలో బేబీ షవర్…
దుబాయ్ లోని సమ్మోస్ క్లబ్ లో ఉపాసన బేబీ షవర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఉపాసన రాంచరణ్ స్నేహితులు పాల్గొన్నారు. గతంలో కూడా హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఉపాసన స్నేహితులు బేబీ షవర్ వేడుకలు నిర్వహించారు . ఇక ప్రస్తుతం దుబాయ్ లో కూడా ఉపాసన బేబీ షవర్ వేడుకలు నిర్వహించగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఉపాసన తెలుపు రంగు లాంగ్ ఫ్రాక్ లో మెరిసింది. దుబాయ్ వెకేషన్ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొంటాడు.